Thursday, 21 May 2026
  • Home  
  • చలివేంద్రంతో దాహార్తి తీర్చుతున్న AVG ఫౌండేషన్ సభ్యులు ఆడాల వరలక్ష్మి, గణేష్
- E-పేపర్

చలివేంద్రంతో దాహార్తి తీర్చుతున్న AVG ఫౌండేషన్ సభ్యులు ఆడాల వరలక్ష్మి, గణేష్

చలివేంద్రంతో దాహార్తి తీర్చుతున్న AVG ఫౌండేషన్ సభ్యులు ఆడాల వరలక్ష్మి, గణేష్ పున్నమి న్యూస్ ప్రతినిధి 21 మే 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : యాచారం మండల పరిధిలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చల్లని తాగునీరు మరియు రాగి జావా మజ్జిగ అందించేందుకు AVG ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు, ప్రయాణికులు, చిన్నారులు, వృద్ధులు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకుంటూ దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా AVG ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, ఎండాకాలంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి రోజు శుభ్రమైన చల్లని నీటిని అందిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. గ్రామంలోని మహిళలు, యువకులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై నీళ్లు పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. చిన్నారులు సైతం ఉత్సాహంగా పాల్గొని చలివేంద్రం వద్ద నీరు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు AVG ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. వేసవి కాలంలో ప్రయాణికులకు, కార్మికులకు చల్లని నీరు అందించడం గొప్ప సేవ అని కొనియాడారు. వేసవి వేడిలో చలివేంద్రంతో సేవా కార్యక్రమo Avg ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు చల్లని తాగునీటి పంపిణీ

చలివేంద్రంతో దాహార్తి తీర్చుతున్న AVG ఫౌండేషన్ సభ్యులు ఆడాల వరలక్ష్మి, గణేష్

పున్నమి న్యూస్ ప్రతినిధి
21 మే 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :

యాచారం మండల పరిధిలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చల్లని తాగునీరు మరియు రాగి జావా మజ్జిగ అందించేందుకు AVG ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు, ప్రయాణికులు, చిన్నారులు, వృద్ధులు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకుంటూ దాహార్తిని తీర్చుకుంటున్నారు.
ఈ సందర్భంగా AVG ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, ఎండాకాలంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ప్రతి రోజు శుభ్రమైన చల్లని నీటిని అందిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు.
గ్రామంలోని మహిళలు, యువకులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై నీళ్లు పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. చిన్నారులు సైతం ఉత్సాహంగా పాల్గొని చలివేంద్రం వద్ద నీరు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
స్థానిక ప్రజలు AVG ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. వేసవి కాలంలో ప్రయాణికులకు, కార్మికులకు చల్లని నీరు అందించడం గొప్ప సేవ అని కొనియాడారు.
వేసవి వేడిలో చలివేంద్రంతో సేవా కార్యక్రమo
Avg ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు చల్లని తాగునీటి పంపిణీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.