- లయన్ డా.పైడి. సింధూర
- లయన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం…(శ్రీకాకుళం – అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)



చెస్ క్రీడతో “ఐక్యూ లెవెల్” వేరే లెవెల్ అని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా.పైడి. సింధూర అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అంతర్జాతీయ పద్దతిలో చదరంగం క్రీడలో శిక్షణ అందిస్తున్న బేరి. చిన్నా రావు స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ, స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ధరిలో ఎంతోమంది విద్యార్థులకు మెళుకువలను అందిస్తున్నారు.
ఈ రోజు అంతర్జాతీయ చదరంగం దినోత్సవంతో పాటు, అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా.పైడి. సింధూర క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రజాదరణ పొందిన క్రీడా చదరంగమని,
అల్జీమర్స్ రాకుండా సహాయపడుతుందని,
మెదడుకు రెండు వైపులా వ్యాయామం చేస్తుందన్నారు. సృజనాత్మకతను, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతుందన్నారు. ఏకాగ్రతను మెరుగుపరుస్తూ, ఒత్తిడిలోనూ మెరుగ్గా, చురుగ్గా ఆలోచింపజేస్తుందని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తు, జీవితంలో ఓటమి, గెలుపులు సహజమని నేర్పుతుందన్నారు.
కార్యదర్శి టెక్కం. రామ్ గోపాల్ మాట్లాడుతూ ప్రజలు అత్యంత ఇష్టపడే బోర్డ్ గేమ్‌లలో చదరంగం కూడా ఒకటని, ప్రపంచంలోని ప్రతిమూలలో చెస్ ఆడే వారు ఉంటారని, జీవితమే ఒక చదరంగం అంటూ ప్రస్తావించడం తెలిసిందేనన్నారు. దీనిని ఆడటానికి మంచి ఏకాగ్రత, చురుకైన మెదడు, అద్భుతమైన వ్యూహాలు, అంకితభావం అవసరమని, ఆటలో గెలవాలంటే ఎత్తుకు పైఎత్తులు వేయడం తెలిసుండాలన్నారు.
అనంతరం బాల, బాలికలకు, చదరంగం క్రీడాకారులకు మిఠాయిలను పంచిపెట్టారు. ఈ ఉభయ వేడుకలలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ ఛైర్పర్సన్ పొడుగు. చరణ్, చదరంగం క్రీడాకారులు, అకాడమీ కోచ్ బేరి. చిన్న రావు, బాలబాలికలు పాల్గొన్నారు.

