Friday, 4 September 2026
  • Home  
  • సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు
- తెలంగాణ - హైదరాబాద్

సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌, సెప్టెంబర్‌ 04: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ మధ్య రెండు జన సాధారణ (అన్‌రిజర్వ్‌డ్‌) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారి శ్రీధర్‌ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రైలు నంబర్‌ 07235 సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు కాగజ్‌నగర్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07236 రైలు కాగజ్‌నగర్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం వల్ల సికింద్రాబాద్‌–ఉత్తర తెలంగాణ మధ్య ప్రయాణించే వారికి అదనపు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.

సికింద్రాబాద్‌, సెప్టెంబర్‌ 04:

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ మధ్య రెండు జన సాధారణ (అన్‌రిజర్వ్‌డ్‌) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారి శ్రీధర్‌ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

రైలు నంబర్‌ 07235 సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు కాగజ్‌నగర్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07236 రైలు కాగజ్‌నగర్‌ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం వల్ల సికింద్రాబాద్‌–ఉత్తర తెలంగాణ మధ్య ప్రయాణించే వారికి అదనపు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.