విజిలెన్స్ రాక గోల్డ్ షాప్స్ మూత
గూడూరులో బంగారం, వెండి వ్యాపారంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో 11 దుకాణాల్లో సుమారు రూ.11 కోట్ల విలువైన బంగారం, రూ.43 కోట్ల విలువైన వెండిని సీజ్ చేసినట్లు సమాచారం. రికార్డుల్లోని నిల్వలకు, వాస్తవ నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు వ్యాపారులు జీఎస్టీ, ఇతర పన్నులు ఎగ్గొడుతూ బిల్లులు లేకుండా విక్రయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్యారెట్ల విషయంలోనూ వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. 18 క్యారెట్లను 22గా, 22 క్యారెట్లను 24 క్యారెట్లుగా చెబుతున్నారనే ఆరోపణలున్నాయి. హాల్మార్క్, జీఎస్టీ బిల్లులపై అధికారులు మరింత నిఘా పెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.


