నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని ఈ నెల 28న సోమవారం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కారణంగా 28న నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. పర్యటన ఏర్పాట్ల అనంతరం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహణపై తదుపరి సమాచారం అందజేస్తామని అధికారులు తెలిపారు.

నెల్లూరు ప్రజలకు గమనిక.. 28న గ్రీవెన్స్ డే రద్దు