Sunday, 27 September 2026
  • Home  
  • సీజ్ కార్ల పేరుతో భారీ మోసం.. రూ.18 లక్షలు వసూలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీజ్ కార్ల పేరుతో భారీ మోసం.. రూ.18 లక్షలు వసూలు

నెల్లూరు: సీజ్ చేసిన నాలుగు కార్లను తక్కువ ధరకే విక్రయిస్తానని నమ్మించి రూ.18 లక్షలు తీసుకుని మోసగించిన ఘటనపై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని జెండావీధికి చెందిన జహీర్‌కు కడపకు చెందిన అఖిల్ అహ్మద్ పరిచయమయ్యాడు. సీజ్ చేసిన కార్లను ఇప్పిస్తానని అఖిల్ నమ్మించడంతో జహీర్, అతని స్నేహితులు కలిసి అతని ఖాతాలకు రూ.12 లక్షలు బదిలీ చేశారు. అదనంగా రూ.6 లక్షలను నగదు రూపంలో అందజేశారు. మొత్తం రూ.18 లక్షలు తీసుకున్న అనంతరం అఖిల్ కార్లు ఇవ్వకుండా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు చిన్నబజారు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.