Thursday, 18 June 2026
  • Home  
  • గిన్నిస్ రికార్డులో ఎక్కిన రేష్మ లభించడం అదృష్టం కోడల్ని కూతురుగా అభివర్ణిస్తూ ప్రత్యూష రెడ్డి .
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గిన్నిస్ రికార్డులో ఎక్కిన రేష్మ లభించడం అదృష్టం కోడల్ని కూతురుగా అభివర్ణిస్తూ ప్రత్యూష రెడ్డి .

. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి కుటుంబంలోకి కంప్యూటర్ రంగంలో ప్రపంచ స్థాయి గిన్నిస్ రికార్డు పొందిన రేష్మారెడ్డి రావడం తమ అదృష్టమని విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల అకామడమిక్ చైర్మన్, రెలిక్ అకాడమీ అధ్యక్షురాలు దొడ్ల ప్రత్యూష రెడ్డి పేర్కొన్నారు. రెలిక్ అలైట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యూష రెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ రేష్మను కూతురుగా అభివర్ణిస్తూ ఆమె సాధించిన విద్యాప్రగతిని వివరించారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించిన రేష్మ మైక్రోసాఫ్ట్ నిర్వహించిన 48 గంటల హ్యాకధాన్ పోటీలో 48 గంటల్లో 48 యాప్స్ రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రశంసలు పొందిందని తెలిపారు. అంతేకాకుండా బోధనపై ఎంతో ఆసక్తి ఉన్న ఆమె మాంటిస్సోరి విద్యా శిక్షణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో కూడా పొందిందని ఆమె అభిరుచి మేరకే నేడు ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది అని తెలిపారు తమకు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల నిర్వహణను తీసుకోవాల్సిన ఆమె అనాసక్తి ప్రదర్శించి పాఠశాల విద్యపై దృష్టి పెట్టిన సందర్భంగా , తాను తన భర్త విద్యాధర్ రెడ్డి ఈ మేరకు ప్రోత్సహించినట్లు తెలిపారు. పెరుగుతున్న కావలి పట్టణానికి భవిష్యత్తు పౌరులకు ప్రాధమిక విద్యకు సంబంధించి రేష్మా రెడ్డి సరైన వ్యక్తిగా ఆమె భావించారు. పుస్తకాల కంటే ప్రక్క మార్గంలోనే విద్యాబోధన సరైన విధానం అని భావించే రేష్మ వాస్తవాలపైనే తన ఆలోచనలు నడిపించేందుకు ఈ పాఠశాలను వేదికగా చేస్తుందని తెలిపారు. గత ఏడు దశాబ్దాలుగా విద్యావ్యవస్థ తో అనుబంధం ఉన్న తమకుటుంబ ప్రతిష్టను రేష్మ తప్పనిసరిగా కొనసాగిస్తుందన్న నమ్మకం తమ కుటుంబానికి ఉందని ప్రత్యూష రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అకాడమీ ప్రధాన కార్యదర్శిగా రేష్మ మాట్లాడుతూ డ్రీమ్, డిస్కవర్, డెవలప్, డెలివరీ అనే నాలుగు పదాల స్తంభాల మీద అకాడమీ ఏర్పాటు అయిందని ఈ నాలుగింటితో ఒక విద్యార్థిని ఉత్తమ విద్యావేత్తగా తీర్చిదిద్దగల మనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ పాఠశాల ఏర్పాటులో అమ్మలా తన వెంట అండగా ఉన్న అత్తయ్య ప్రత్యూష రెడ్డి మామయ్య విద్యాధర్ రెడ్డి భర్త లిఖిత్ రెడ్డి ల సహకారం మరువలేనిదని అకాడమీ అభివృద్ధిలో కావలి వాసులు తమ వంతు సహకారం అందిస్తారని ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. అత్తను అమ్మగా రేష్మ రెడ్డి ,కోడల్ని కూతురుగా ప్రత్యూష రెడ్డి సంబోధిస్తూ చేసిన ప్రసంగం విచ్చేసిన ఆహుతులను ఎంతగానో అలరించింది.

.

ప్రముఖ విద్యావేత్త డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి కుటుంబంలోకి కంప్యూటర్ రంగంలో ప్రపంచ స్థాయి గిన్నిస్ రికార్డు పొందిన రేష్మారెడ్డి రావడం తమ అదృష్టమని విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల అకామడమిక్ చైర్మన్, రెలిక్ అకాడమీ అధ్యక్షురాలు దొడ్ల ప్రత్యూష రెడ్డి పేర్కొన్నారు. రెలిక్ అలైట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యూష రెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేస్తూ రేష్మను కూతురుగా అభివర్ణిస్తూ ఆమె సాధించిన విద్యాప్రగతిని వివరించారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించిన రేష్మ మైక్రోసాఫ్ట్ నిర్వహించిన 48 గంటల హ్యాకధాన్ పోటీలో 48 గంటల్లో 48 యాప్స్ రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ప్రశంసలు పొందిందని తెలిపారు. అంతేకాకుండా బోధనపై ఎంతో ఆసక్తి ఉన్న ఆమె మాంటిస్సోరి విద్యా శిక్షణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో కూడా పొందిందని ఆమె అభిరుచి మేరకే నేడు ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది అని తెలిపారు తమకు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల నిర్వహణను తీసుకోవాల్సిన ఆమె అనాసక్తి ప్రదర్శించి పాఠశాల విద్యపై దృష్టి పెట్టిన సందర్భంగా , తాను తన భర్త విద్యాధర్ రెడ్డి ఈ మేరకు ప్రోత్సహించినట్లు తెలిపారు. పెరుగుతున్న కావలి పట్టణానికి భవిష్యత్తు పౌరులకు ప్రాధమిక విద్యకు సంబంధించి రేష్మా రెడ్డి సరైన వ్యక్తిగా ఆమె భావించారు. పుస్తకాల కంటే ప్రక్క మార్గంలోనే విద్యాబోధన సరైన విధానం అని భావించే రేష్మ వాస్తవాలపైనే తన ఆలోచనలు నడిపించేందుకు ఈ పాఠశాలను వేదికగా చేస్తుందని తెలిపారు.
గత ఏడు దశాబ్దాలుగా విద్యావ్యవస్థ తో అనుబంధం ఉన్న తమకుటుంబ ప్రతిష్టను రేష్మ తప్పనిసరిగా కొనసాగిస్తుందన్న నమ్మకం తమ కుటుంబానికి ఉందని ప్రత్యూష రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అకాడమీ ప్రధాన కార్యదర్శిగా రేష్మ మాట్లాడుతూ డ్రీమ్, డిస్కవర్, డెవలప్, డెలివరీ అనే నాలుగు పదాల స్తంభాల మీద అకాడమీ ఏర్పాటు అయిందని ఈ నాలుగింటితో ఒక విద్యార్థిని ఉత్తమ విద్యావేత్తగా తీర్చిదిద్దగల మనే నమ్మకం తనకు ఉందని తెలిపారు. ఈ పాఠశాల ఏర్పాటులో అమ్మలా తన వెంట అండగా ఉన్న అత్తయ్య ప్రత్యూష రెడ్డి మామయ్య విద్యాధర్ రెడ్డి భర్త లిఖిత్ రెడ్డి ల సహకారం మరువలేనిదని అకాడమీ అభివృద్ధిలో కావలి వాసులు తమ వంతు సహకారం అందిస్తారని ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. అత్తను అమ్మగా రేష్మ రెడ్డి ,కోడల్ని కూతురుగా ప్రత్యూష రెడ్డి సంబోధిస్తూ చేసిన ప్రసంగం విచ్చేసిన ఆహుతులను ఎంతగానో అలరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.