Sunday, 2 August 2026
  • Home  
  • ఉద్యమ నాయకులం.. ఉడత బెదిరింపులకు భయపడం
- మంచిర్యాల

ఉద్యమ నాయకులం.. ఉడత బెదిరింపులకు భయపడం

బెల్లంపల్లి పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్ విసిరిన చాలెంజ్ స్వీకరిస్తున్నామని, పట్టణ అభివృద్ధి పై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బెల్లంపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు భత్తుల సుదర్శన్ అన్నారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నూనెటి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సుదర్శన్ మాట్లాడారు. తాము తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్‌ఎస్‌ నాయకులం అని , కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ ఉడుత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. సమయం, స్థలం ఎక్కడో చెబితే బెల్లంపల్లి పట్టణ బీఆర్ఎస్ తరపున పట్టణ అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్లంపల్లి మున్సిపాలిటీలో నూతనంగా జరిగిన అభివృద్ధి శూన్యమని, గత ప్రభుత్వం హయాంలో మంజూరైన నిధులనే సవరించి వాటితోనే అరకొర పనులను చేస్తున్నారని ఆరోపించారు. తాము కళ్లకు గంతలు కట్టుకొని చేసిన నిరసనలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించాలని, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కూరగాయల మార్కెట్ ను మరింత ఆధునికరించాలని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కోరినట్లు తెలిపారు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడడం సమంజసం కాదన్నారు. ఛాలెంజ్ విసిరి మళ్ళీ మాట మార్చకుండా త్వరగా సమయం, స్థలం నిర్ణయిస్తే బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి పై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కౌన్సిలర్లు,తాండ్ర స్రవంతి గోగర్ల స్వప్న, బెడ్డల సౌజన్య బత్తుల అనిత, రజిత తిరుమల వాసు,కాంపెల్లి రాజం, పట్టణ యువజన నాయకుడు సబ్బని అరుణ్ నాయకులు, సుందర్ రావు, ఈట రాకేష్, ప్రవీణ్ గోగర్ల సత్యనారాయణ రామకృష్ణ చంద్రశేఖర్, కేంశెట్టి శ్రీనివాస్ మల్లయ్య,సంపత్ భీమ శంకర్, మణి, ఆకుల సాయి, రవితేజ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.