ఖమ్మం జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గత ఓటర్ల జాబితాతో పోలిస్తే ఖమ్మం నియోజకవర్గంలో ఏకంగా 80,663 ఓట్లు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని నియోజకవర్గాలన్నింటిలో ఖమ్మం నియోజకవర్గంలోనే అత్యధికంగా ఓట్లు తగ్గినట్లు తెలిపారు. ముసాయిదా జాబితాలో తమ పేరు, వివరాలను ఓటర్లు పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. అభ్యంతరాలు లేదా తప్పులు ఉంటే సంబంధిత బీఎల్‌ఓలు, ఈఆర్‌ఓలకు తెలియజేయాలని పేర్కొన్నారు.



