ఖమ్మం జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
మోహరం పండుగ సందర్భంగా బీజేపీ మైనారిటీ నాయకులు సయ్యద్ మోహినుద్దీన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహర్రం ఇస్లామిక్ క్యాలెండర్లో తొలి, అత్యంత పవిత్రమైన నెల అని పేర్కొన్నారు. ఇది ఆనందోత్సవం కాదని, కర్బాలా యుద్ధంలో హజ్రత్ ఇమామ్ హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యులు అధర్మం, అన్యాయానికి వ్యతిరేకంగా చేసిన మహా త్యాగాన్ని స్మరించుకునే సంతాప మాసమని అన్నారు. మోహర్రంతో ఇస్లామిక్ నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపారు. ఆషూరా రోజున ప్రత్యేక ఉపవాసాలు, ప్రార్థనలు నిర్వహిస్తారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో దీనిని “పీర్ల పండుగ”గా పిలుస్తారని, పంజా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తూ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటారని పేర్కొన్నారు.



