Wednesday, 5 August 2026
  • Home  
  • గ్రామీణ రైతులకు వరం.. హైడ్రో లిఫ్ట్ పరికరం
- తూర్పు గోదావరి

గ్రామీణ రైతులకు వరం.. హైడ్రో లిఫ్ట్ పరికరం

ఉత్తమ గ్రాస్‌రూట్ ఇన్నోవేటర్ పంపన శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే నల్లమిల్లి సత్కారం అనపర్తి, ఆగస్టు 5 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): పెదపూడి మండలం కైకవోలు గ్రామానికి చెందిన ఆవిష్కర్త పంపన శ్రీనివాస్‌ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్, కేఎల్ యూనివర్సిటీ, విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన హైడ్రో లిఫ్ట్ పరికరానికి శ్రీనివాస్ ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఉత్తమ గ్రాస్‌రూట్ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ అవసరాలకు అనుగుణంగా యువత రూపొందిస్తున్న వినూత్న ఆవిష్కరణలు దేశాభివృద్ధికి దోహదపడతాయన్నారు. విద్యుత్, డీజిల్, మోటారు అవసరం లేకుండా నీటిని ఎత్తైన ప్రాంతాలకు తరలించే హైడ్రో లిఫ్ట్ పరికరం గిరిజన, కొండ ప్రాంతాల రైతులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

ఉత్తమ గ్రాస్‌రూట్ ఇన్నోవేటర్ పంపన శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే నల్లమిల్లి సత్కారం

అనపర్తి, ఆగస్టు 5 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి): పెదపూడి మండలం కైకవోలు గ్రామానికి చెందిన ఆవిష్కర్త పంపన శ్రీనివాస్‌ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్, కేఎల్ యూనివర్సిటీ, విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన హైడ్రో లిఫ్ట్ పరికరానికి శ్రీనివాస్ ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఉత్తమ గ్రాస్‌రూట్ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ అవసరాలకు అనుగుణంగా యువత రూపొందిస్తున్న వినూత్న ఆవిష్కరణలు దేశాభివృద్ధికి దోహదపడతాయన్నారు. విద్యుత్, డీజిల్, మోటారు అవసరం లేకుండా నీటిని ఎత్తైన ప్రాంతాలకు తరలించే హైడ్రో లిఫ్ట్ పరికరం గిరిజన, కొండ ప్రాంతాల రైతులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.