Monday, 3 August 2026
  • Home  
  • కూటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రత్యేక పూజలు
- తూర్పు గోదావరి

కూటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రత్యేక పూజలు

అనపర్తి, ఆగస్టు 3 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలోని శ్రీ పార్వతి సమేత కూటేశ్వర స్వామి ఆలయాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులతో ఎమ్మెల్యే మమేకమయ్యారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న అన్నసమారాధన కార్యక్రమం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కుతుకులూరు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

అనపర్తి, ఆగస్టు 3 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి):
అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలోని శ్రీ పార్వతి సమేత కూటేశ్వర స్వామి ఆలయాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులతో ఎమ్మెల్యే మమేకమయ్యారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న అన్నసమారాధన కార్యక్రమం అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో కుతుకులూరు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.