కాకినాడ జిల్లా
తేదీ: 23-08-26
*కాకినాడ ఎస్ కె కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరీంద్ర ప్రసాద్*
*శనివారం ఎస్ కె కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల మధ్య మొబైల్ ఫోన్ మిస్ అయిన విషయమే జరిగిన గొడవను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన విషయం విదితమే..*
*ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కలెక్టర్ ఎస్ కె కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు..*
*విద్యార్థులు తమకు ఏ సమస్య లేదని సురక్షితంగా ఉన్నామని కలెక్టర్కు తెలిపారు..*
*విద్యార్థులు తమకు ఏ సమస్య ఉన్నా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.*




