తోట్టంబేడు మండలం కన్నలి గ్రామంలో శనివారం జరిగిన కన్నలి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతాప్ రెడ్డి స్వగృహానికి విచ్చేసిన ఆయన, ప్రతాప్ రెడ్డి సమక్షంలో కేక్ కట్ చేయించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు ఆత్మీయంగా సమయాన్ని గడిపారు. అనంతరం కన్నలి గ్రామంలోని కూటమి కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ ప్రజలను నేరుగా కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలపై గ్రామస్థులతో సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వ హయాంలో కన్నలి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తన వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.

కన్నలి ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల-గ్రామ అభివృద్ధికి భరోసా