స్వాతంత్ర్య సమరయోధురాలు , బాలికా విద్య కోసం సర్వం త్యాగం చేసిన, నెల్లూరు లో పినాకిని ఆశ్రమ స్థాపకురాలు శ్రీమతి పొణకాకనకమ్మ కు భారత రత్న,, ఆమె పేరు తో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ని కోరుతూ,పొణకా కనకమ్మ ఆశయ సాధన సమితి, కవికోకిల దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి విజ్ఞప్తి చేసింది.
సమితి కన్వీనర్ సురేంద్ర నాధ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు జయప్రతాప్ రెడ్డి, దగుమాటి కృష్ణ లు ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో చేసిన వినతి కి మాగుంట స్పందిస్తూ తన వంతు సహకారం ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. నెల్లూరు జిల్లా కి ప్రతిష్టాత్మక వ్యక్తి అయిన కణకమ్మకు ఆ గౌరవం లభించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
జూలై లో హైదరాబాద్ లో జరిగే జయంతి ఉత్సవాలకు హాజరవుతానని మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుపడం పట్ల సమితి ధన్యవాదాలు తెలిపింది.

కణకమ్మకు భారత రత్న ప్రధానం పై.. యమ్.పి. మాగుంట కు వినతి
స్వాతంత్ర్య సమరయోధురాలు , బాలికా విద్య కోసం సర్వం త్యాగం చేసిన, నెల్లూరు లో పినాకిని ఆశ్రమ స్థాపకురాలు శ్రీమతి పొణకాకనకమ్మ కు భారత రత్న,, ఆమె పేరు తో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ని కోరుతూ,పొణకా కనకమ్మ ఆశయ సాధన సమితి, కవికోకిల దువ్వూరు రామిరెడ్డి విజ్ఞాన సమితి విజ్ఞప్తి చేసింది. సమితి కన్వీనర్ సురేంద్ర నాధ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధులు జయప్రతాప్ రెడ్డి, దగుమాటి కృష్ణ లు ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో చేసిన వినతి కి మాగుంట స్పందిస్తూ తన వంతు సహకారం ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. నెల్లూరు జిల్లా కి ప్రతిష్టాత్మక వ్యక్తి అయిన కణకమ్మకు ఆ గౌరవం లభించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జూలై లో హైదరాబాద్ లో జరిగే జయంతి ఉత్సవాలకు హాజరవుతానని మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుపడం పట్ల సమితి ధన్యవాదాలు తెలిపింది.

