*ఐపీఎస్ అధికారిణినే వస్తావా.. నీ రేటు ఎంత అని అడిగిన పోకిరీలు..*
పున్నమి న్యూస్ ప్రతినిధి
06 మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే IPS సుమతి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై దృష్టి పెట్టారు.
రాత్రి 12 గంటల సమయంలో దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, సాధారణ మహిళలా వేషం మార్చుకుని బస్టాండ్‌లోకి వెళ్లారు.
*ఆమె ఎవరో తెలియక కొందరు పోకిరీలు ఆమెను చుట్టుముట్టి వస్తావా? నీ రేటు ఎంత? ఎంతివ్వాలంటూ అంటూ వెకిలి ప్రశ్నలు అడగడం ప్రారంభించారు*.
*ఆ మూడు గంటలలో ఎలాంటి పెట్రోలింగ్ వాహనం గానీ, పోలీసులు గానీ అక్కడికి రాకపోవడంతో మరింతగా రెచ్చిపోయారు*
*SI వచ్చి సెల్యూట్ చేయడంతో ఆమె IPS కమిషనర్ సుమతి అని తెలిసింది*
*40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకుని వారికి గట్టి హెచ్చరిక చేశారు


