Wednesday, 6 May 2026
  • Home  
  • వనపర్తిలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించిన…..బిఎస్పి
- తెలంగాణ

వనపర్తిలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించిన…..బిఎస్పి

వనపర్తిలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించిన…..బిఎస్పి నాయకులు తెలంగాణ వనపర్తి 06-05-2026 (పున్నమి ప్రతినిధి) ఈ రోజు వనపర్తి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు గూడెం ఎల్లస్వామి గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఘనపురం కృష్ణ అన్న గారు, ఉమ్మడి జిల్లా జోన్ ఇంచార్జ్ పృథ్వీరాజ్ గారు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ లు సి. కళ్యాణ్ గారు, మిద్దె మహేష్ గారు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులకు సూచిస్తూ, ఈ నెల 12వ తేదీన షాద్ నగర్ లో నిర్వహించనున్న 4th జోన్ సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలనీ కోరడం జరిగింది. 11వ తేదీ వరకూ వనపర్తి జిల్లా కమిటీ, వనపర్తి అసెంబ్లీ కమిటీ మరియు నాయకుల గ్రామాల్లో బూత్ కమిటీలు ఖచ్చితంగా ఉండాలని, బూత్ కమిటీల నాయకులను సమీక్ష సమావేశానికి తీసుకుని రావాలని తెలియజేయడం జరిగింది. అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ. ఇబ్రాం శేఖర్ అన్న గారు పంపిన మాన్యవర్ కాన్షిరాం గారి జీవిత చరిత్ర పుస్తకాలను పార్టీ నాయకులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాజీ జిల్లా ఇంచార్జ్ మాసన్న, జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్, అసెంబ్లీ ఇంచార్జ్ మండ్ల మైబుస్, అసెంబ్లీ అధ్యక్షులు దండు రాజు, బండరాయిపాకుల గ్రామ బూత్ అధ్యక్షులు యాదగిరి, నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

వనపర్తిలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించిన…..బిఎస్పి నాయకులు

తెలంగాణ వనపర్తి 06-05-2026 (పున్నమి ప్రతినిధి)

ఈ రోజు వనపర్తి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు గూడెం ఎల్లస్వామి గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఘనపురం కృష్ణ అన్న గారు, ఉమ్మడి జిల్లా జోన్ ఇంచార్జ్ పృథ్వీరాజ్ గారు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ లు సి. కళ్యాణ్ గారు, మిద్దె మహేష్ గారు హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులకు సూచిస్తూ, ఈ నెల 12వ తేదీన షాద్ నగర్ లో నిర్వహించనున్న 4th జోన్ సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలనీ కోరడం జరిగింది. 11వ తేదీ వరకూ వనపర్తి జిల్లా కమిటీ, వనపర్తి అసెంబ్లీ కమిటీ మరియు నాయకుల గ్రామాల్లో బూత్ కమిటీలు ఖచ్చితంగా ఉండాలని, బూత్ కమిటీల నాయకులను సమీక్ష సమావేశానికి తీసుకుని రావాలని తెలియజేయడం జరిగింది. అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ. ఇబ్రాం శేఖర్ అన్న గారు పంపిన మాన్యవర్ కాన్షిరాం గారి జీవిత చరిత్ర పుస్తకాలను పార్టీ నాయకులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాజీ జిల్లా ఇంచార్జ్ మాసన్న, జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్, అసెంబ్లీ ఇంచార్జ్ మండ్ల మైబుస్, అసెంబ్లీ అధ్యక్షులు దండు రాజు, బండరాయిపాకుల గ్రామ బూత్ అధ్యక్షులు యాదగిరి, నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.