Wednesday, 24 June 2026
  • Home  
  • ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో తిరుపతి పార్లమెంట్ కమిటీ సమావేశం
- తిరుపతి

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో తిరుపతి పార్లమెంట్ కమిటీ సమావేశం

శ్రీ కాళహస్తి, జూన్ 23, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నివాసంలో తిరుపతి పార్లమెంట్ కమిటీ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ ప్రాధాన్యత కలిగిన సమావేశంలో జోన్-4 ఇంచార్జ్ దామచర్ల సత్య, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, జిల్లా టీడీపీ జనరల్ సెక్రటరీ డాలర్స్ దివాకర్ రెడ్డి, పార్లమెంట్ పరిధిలోని శాసనసభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా తిరుపతి పార్లమెంట్, శ్రీకాళహస్తి నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధి, పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నిరంతరం కార్యకర్తల అభ్యున్నతికి, వారికి న్యాయం చేయడానికే కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసే వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం సమావేశానికి విచ్చేసిన నాయకులు, ప్రజాప్రతినిధులకు విందు ఏర్పాటు చేశారు. కూటమి శ్రేణుల ఉత్సాహం, కార్యకర్తల నమ్మకమే రాబోయే విజయాలకు పునాది అని నాయకులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.