గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం, ప్రకాశరావుపాలెం గ్రామంలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం, ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలిసి రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








