ఉదయగిరి వ్యవసాయ కళాశాల సమస్యలపై వినతి పత్రం
ఉదయగిరి: పట్టణంలోని SMGR ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పల్దాగు వెంకట సత్యనారాయణ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో నెలకొన్న మౌలిక వసతుల కొరత, విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులు, బోధనా సిబ్బంది సమస్యలను వారు ఉపకులపతి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు, సిబ్బంది వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామని ఉపకులపతి హామీ ఇచ్చారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఉదయగిరి వ్యవసాయ కళాశాల సమస్యలపై వినతి పత్రం
ఉదయగిరి వ్యవసాయ కళాశాల సమస్యలపై వినతి పత్రం ఉదయగిరి: పట్టణంలోని SMGR ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పల్దాగు వెంకట సత్యనారాయణ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో నెలకొన్న మౌలిక వసతుల కొరత, విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులు, బోధనా సిబ్బంది సమస్యలను వారు ఉపకులపతి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు, సిబ్బంది వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామని ఉపకులపతి హామీ ఇచ్చారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

