*ఇష్టారాజ్యంగా రోడ్డు మధ్యలో వాహనాల నిలుపుదల*
*ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రమాదాలకు ఆహ్వానం*
*ఏన్కూరులో MSR క్రషర్ వాహనాల ఆక్రమణతో ప్రజల ఆగ్రహం*
జులై 21 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
ఏన్కూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఇష్టానుసారంగా వాహనాలను నిలుపుదల చేయడం వల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డు పక్కన స్థలం ఉన్నప్పటికీ కొంతమంది ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనాలు రోడ్డు మధ్యలోనే గుంపులుగా నిలబెట్టి మాట్లాడుకుంటున్నారు.
దీంతో రోడ్డు వెడల్పు తగ్గి రద్దీ సమయంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
*MSR క్రషర్ భారీ వాహనాల ఆక్రమణ*
ఏన్కూరు మండల కేంద్రంలో *MSR CONSTRUCTIONS* *MSR క్రషర్‌కు* చెందిన భారీ సిమెంట్ మిక్సర్ లారీలు, ఇతర భారీ వాహనాలు యథేచ్ఛగా ప్రధాన రహదారిపై నిలిపివేయడంతో రోడ్డులో సగభాగం ఆక్రమితమవుతోంది.
దీంతో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఎదురెదురుగా వాహనాలు వచ్చిన సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*అత్యవసర సేవలకు అడ్డంకి*
రద్దీ సమయంలో ఆంబులెన్స్, స్కూల్ బస్సులు వంటి అత్యవసర వాహనాలకు సైతం ఈ వాహనాల నిలుపుదల అడ్డంకిగా మారుతోంది. రోడ్డు పక్కన షాపులు, బజార్ ఉండటంతో ప్రజలు నిర్లక్ష్యంగా వాహనాలు పెడుతుండడంతో సమస్య మరింత జటిలమవుతోంది
రోజూ ఇదే పరిస్థితి. పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
రోడ్డు మధ్యలో వాహనాలు నిలుపుదల చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రధాన రహదారిపై నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలి.
ట్రాఫిక్ పోలీసులతో క్రమం తప్పకుండా తనిఖీలు చేయించాలి.
క్రషర్ యాజమాన్యం తమ భారీ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలం కేటాయించుకోవాలి.
ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి.
రహదారి భద్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, వాహనాలను నిర్ణీత పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలని మండల ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



