ఖమ్మం ఆగష్టు 6
(పున్నమి ప్రతినిధి)
ఖమ్మం నగర కార్పొరేషన్‌లో చోటుచేసుకున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఖమ్మం నగర కార్పొరేషన్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి, అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్పొరేషన్‌లో జరిగిన అవకతవకలపై స్వతంత్ర విచారణ జరిపి ప్రజలకు నిజాలు వెల్లడించాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.


