– కే. కందులవారిపల్లిలో ‘రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి’ కార్యక్రమం
– గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించిన ముక్కా వరలక్ష్మి
– ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని భరోసా రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేలు మండలం కే. కందులవారిపల్లి పంచాయతీలో “రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి” డోర్ టు డోర్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని గడపగడపకూ తిరుగుతూ.. ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆయా పథకాలకు సంబంధించిన కరపత్రాలను స్వయంగా పంపిణీ చేశారు. ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలను, స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం ప్రజా సంక్షేమం, అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని ముక్కా వరలక్ష్మి ఉద్ఘాటించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– కే. కందులవారిపల్లిలో ‘రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి’ కార్యక్రమం – గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించిన ముక్కా వరలక్ష్మి – ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని భరోసా రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేలు మండలం కే. కందులవారిపల్లి పంచాయతీలో “రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి” డోర్ టు డోర్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలోని గడపగడపకూ తిరుగుతూ.. ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఆయా పథకాలకు సంబంధించిన కరపత్రాలను స్వయంగా పంపిణీ చేశారు. ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలను, స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం ప్రజా సంక్షేమం, అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని ముక్కా వరలక్ష్మి ఉద్ఘాటించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

