ఉపకార వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన ‘చలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు శాసనల సాయి రామ్‌ను సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. .



