Monday, 7 September 2026
  • Home  
  • వెయ్యి రోజుల పాలన.. హామీల అమలేది?
- ఖమ్మం

వెయ్యి రోజుల పాలన.. హామీల అమలేది?

కాకరవాయిలో బీఆర్‌ఎస్‌ “బాకీ కార్డు” నిరసన తిరుమలాయపాలెం, సెప్టెంబర్‌ 7: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా, ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కాకరవాయిలో “ఇంటింటికీ బాకీ కార్డు” నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు వీరబోయిన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌, రూ.4 వేల నిరుద్యోగ భృతి, యూత్‌ డిక్లరేషన్‌ హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయడంతో పాటు జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని కోరారు. యువతను ఇచ్చిన హామీలతో మోసం చేస్తే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో అన్నం లింగారెడ్డి, గుంటి ప్రసాద్‌, కుదుర్ల మధు, షేక్‌ అసిఫ్‌, ధర్మపురి దుర్గయ్య, సైదులు, వీరబోయిన దేవేందర్‌, అబ్రాపూరి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

కాకరవాయిలో బీఆర్‌ఎస్‌ “బాకీ కార్డు” నిరసన

తిరుమలాయపాలెం, సెప్టెంబర్‌ 7:
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా, ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కాకరవాయిలో “ఇంటింటికీ బాకీ కార్డు” నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు వీరబోయిన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.

రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌, రూ.4 వేల నిరుద్యోగ భృతి, యూత్‌ డిక్లరేషన్‌ హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయడంతో పాటు జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని కోరారు. యువతను ఇచ్చిన హామీలతో మోసం చేస్తే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

కార్యక్రమంలో అన్నం లింగారెడ్డి, గుంటి ప్రసాద్‌, కుదుర్ల మధు, షేక్‌ అసిఫ్‌, ధర్మపురి దుర్గయ్య, సైదులు, వీరబోయిన దేవేందర్‌, అబ్రాపూరి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.