ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఇచ్చిన ‘చలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఖమ్మంలో బోళ్ల రాంబాబు, బోయినపల్లి సురేష్, రుద్రగాని మాధవ్లను ఖమ్మం టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సత్తుపల్లిలో పాలనాగ సురేంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా ముందస్తుగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఉపకార వేతనాలు విడుదలయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.

చలో అసెంబ్లీకి ముందే బీజేపీ నేతల అరెస్టులు..