Saturday, 27 June 2026
  • Home  
  • ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’కు విశేష స్పందన.. సమస్యల పరిష్కారానికి సుధీర్ రెడ్డి ఆదేశాలు
- తిరుపతి

‘డయల్ యువర్ ఎమ్మెల్యే’కు విశేష స్పందన.. సమస్యల పరిష్కారానికి సుధీర్ రెడ్డి ఆదేశాలు

శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు శనివారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. ప్రముఖ వార్తా సంస్థ వే టు న్యూస్ (Way2News) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో దాదాపు 300కు పైగా ఫోన్ కాల్స్ అందగా, 41 మంది బాధితులతో ఎమ్మెల్యే నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రోడ్ల దుస్థితి, తాగునీటి కొరత, డ్రైనేజీ సమస్యలు, మౌలిక సదుపాయాల లోపం వంటి అంశాలపై ప్రజలు వినతులు సమర్పించారు. వెంటనే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే, పెండింగ్ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య వారధిగా నిలుస్తూ ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వే టు న్యూస్ బృందానికి ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజల సంక్షేమమే తన తొలి ప్రాధాన్యమని, ఇలాంటి ప్రత్యక్ష వేదికలు ప్రజా సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. 20 ఏళ్లుగా వెంటాడిన విద్యుత్ ప్రమాద భయం తొలగిపోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం సంతోషకరమని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.