అనంతసాగరం సెప్టెంబర్ 08,పున్నమి ప్రతినిధి:
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల గ్రామ పంచాయతీలో యంత్రాలతో విబి-జీ రాం జీ ఉపాధిహామీ పనులు..
అధికార పార్టీ నాయకుల అండ దండాలతో ఓ మేట్ నిర్వహిస్తున్న క్యాటిల్ పాండ్ పనులు.. ఒక వారం మ్యాన్యూవల్ పద్ధతిలో ఉపాధి శ్రామికులు చేత పనులు.. రెండో వారం జేసీబీ యంత్రాలతో పనులు..ఒకే చోట రెండు వర్క్ ఐడి లు..మరో పక్క మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో వారానికి 100 రూపాయలు నగదు కూలీల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు.. ఇంత అవినీతి జరుగుతున్నా పట్టించుకోని మండల అధికారులు..


