ఖమ్మం జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ తెలిపారు. జిల్లాలో మొత్తం 10,85,927 మంది ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. ఇందులో మ్యాపింగ్ కాని, అనామలీస్‌గా గుర్తించిన 1,75,858 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 1,75,841 నోటీసులను రూపొందించి, 1,32,817 మందికి అందజేసినట్లు వివరించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు సంబంధించిన విచారణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే 14,680 మంది ఓటర్ల హియరింగ్ పూర్తయ్యిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దివాకర్ టి.ఎస్ స్పష్టం చేశారు.



