*
టీడీపీ,జనసేన నుండి వైఎస్ఆర్ సీపీలోకి లాంచనప్రాయంగా నేడు పార్టీలోకి రావటానికి ఆమోదం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామం నుంచి ఆత్రేయపురం టీడీపీ మండల మాజీ ఎంపీపీ, పేరవరం గ్రామ మాజీ సర్పంచ్ బెజవాడ హిమబిందు సతీష్ దంపతుల ఆధ్వర్యంలో టిడిపి మరియు జనసేన పార్టీ నుండి నాయకులు కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో జాయిన్ అవ్వటానికి ముహూర్తం ప్రకారం ఈరోజు వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి ఆమోదం పొందారు . వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి,సీనియర్ రాయి వెంకటేశ్వరరావు గార్ల నాయకత్వంపై నమ్మకంతో, పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.
ఇదే క్రమంలో సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు టిడిపి మరియు జనసేన పార్టీల నుండి భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, రాష్ట్ర బూత్ కమిటీ విభాగం ప్రధాన కార్యదర్శి మార్గాన గంగాధర్ రావు, రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి చిలువూరి రామ కృష్ణం రాజు, రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం కార్యదర్శి కొల్లి శ్యాంసన్ , రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సాకా ప్రసన్నకుమార్, మండల అధ్యక్షులు కనుమూరి శ్రీనివాసరాజు, ఆత్రేయపురం మండల ఎంపీపీ కుందా అన్నపూర్ణ మరియు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


