Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

భూముల సమగ్ర రీసర్వే చేపట్టాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భూముల సమగ్ర రీసర్వే చేపట్టాలి

కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో భూభారతి, 22-ఏ, సమగ్ర భూ రీసర్వేకు సంబంధించి నిర్దేశించిన అంశాలపై రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐడీఓసీ నుంచి వీ.సీకి హాజరయ్యారు.
భూభారతి డేటా ఆధారంగా 22-ఏ ఎక్స్‌టెంట్‌లో తేడాలు ఉంటే వాటిని భూభారతి పోర్టల్‌లోనే పరిష్కరించాలని కార్యదర్శి సూచించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 22-ఏ కింద నమోదైన భూములను గుర్తించి, నిర్ణీత ప్రొఫార్మాలో తహసీల్దార్ల నుంచి వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ అమలు చేయాలని తెలిపారు.
ఎస్‌ఆర్‌ఓల్లో అందుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సమగ్ర భూ రీసర్వే నిర్వహించాలని, దాని ఫలితాల ఆధారంగా అన్ని గ్రామాల్లో రీసర్వే చేపట్టాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

భూముల సమగ్ర రీసర్వే చేపట్టాలి

భూముల సమగ్ర రీసర్వే చేపట్టాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *