Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

అమ్మవార్ల ఆలయాల నిర్మాణాలకు కోన తాత రావు ఆర్థిక సహాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అమ్మవార్ల ఆలయాల నిర్మాణాలకు కోన తాత రావు ఆర్థిక సహాయం

వార్త ముఖ్యాంశాలు

  • గాజువాక, పున్నమి , ఆగష్టు 18:నెల్లిముక్కు గ్రామ పంచాయతీ ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పెంటమాంబ అమ్మవారి ఆలయ ఆవరణలో నిర్మాణం అవుతున్న మహాశక్తి,దుర్గాలమ్మ, కుంచమ్మ, భూలోకమ్మా, మరిడి మాంబ,శక్తి అమ్మవార్ల ఆలయలకు భక్తులు భారీ విరాళాలు అందజేస్తున్నారు.
  • దీనిలో భాగంగా సోమవారం శ్రీ పెంటమాంబ పండుగలు ఘనంగా జరిగాయి.
  • జనసేన కేంద్ర కమిటీ నాయకులు జిల్లా సెంట్రల్ సహకార బ్యాంకు చైర్మన్ కోన తాత రావు యాభై ఒక్క వేయి నూట పదహారు రూపాయల విరాళన్ని అందజేసి తమ భక్తిని చాటుకున్నారు.

గాజువాక, పున్నమి , ఆగష్టు 18:నెల్లిముక్కు గ్రామ పంచాయతీ ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పెంటమాంబ అమ్మవారి ఆలయ ఆవరణలో నిర్మాణం అవుతున్న మహాశక్తి,దుర్గాలమ్మ, కుంచమ్మ, భూలోకమ్మా, మరిడి మాంబ,శక్తి అమ్మవార్ల ఆలయలకు భక్తులు భారీ విరాళాలు అందజేస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం శ్రీ పెంటమాంబ పండుగలు ఘనంగా జరిగాయి. జనసేన కేంద్ర కమిటీ నాయకులు జిల్లా సెంట్రల్ సహకార బ్యాంకు చైర్మన్ కోన తాత రావు యాభై ఒక్క వేయి నూట పదహారు రూపాయల విరాళన్ని అందజేసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్బంగా నెల్లిముక్కు పంచాయతీ పెద్దలు గోందేశీ మహేశ్వర రెడ్డి పులి రమణ రెడ్డి మాట్లాడుతు ఈ ప్రాంతంలో శక్తి స్వరూపిణి శ్రీ పెంటమాంబ అమ్మవారు వారి అక్క చెల్లెల్లు ఎనిమిది మంది దేవతలు నిత్యం పూజలందుకుంటున్నారని ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషలతో ఉండాలని ఈ దేవత మూర్తుల ఆలయాలు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా దాతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు కోన తాత రావును ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో ఆలయ డైరెక్టర్లు గోందేశీ అప్పల రెడ్డి, యేల్లేటి శ్రీనివాస రావు మొల్లి రమణ గంట్యాడ పైడిరాజు లతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పిట్ట కుంచరావు పాల అప్పల రెడ్డి పాల అప్పా రావు మొల్లి అప్పల నాయుడు ముద్దుర్తి శ్రీరామ మూర్తి మారి నాయుడు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *