తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.
తూర్పుగోదావరి, 19 మే (పున్నమి ప్రతినిధి):
అనపర్తిలో గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి గారి నివాసం వద్ద గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ గారి సహకారంతో తూర్పు డెల్టా పరిధిలో పనిచేస్తున్న 100 మంది అవుట్ సోర్సింగ్ లాస్కర్ లకు ఇండియా పోస్ట్ మరియు ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ రూపొందించిన ₹10 లక్షల ప్రమాద బీమా బాండ్స్ అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అనపర్తి నియోజకవర్గంకి సంబంధించిన 15 మంది అవుట్ సోర్సింగ్ లాస్కర్ లకు ఇండియా పోస్ట్ మరియు ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ ₹10 లక్షల ప్రమాద బీమా బాండ్స్ ను అందించేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి.
ఈ సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ
ఈరోజు ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ గారు చైర్మన్ గా నియమితులైన నాటి నుండి ఈస్ట్రన్ డెల్టాలో పనిచేస్తున్న సిబ్బందికి అనేక రకాలుగా సహకారం అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా గతంలో లాస్కర్ లకు రెయిన్ కోట్లు, టార్చ్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ఒక లాస్కర్ మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఎటువంటి సహాయం అందించలేని పరిస్థితి ఏర్పడింది, లాస్కర్ లకు ఏవిధంగా సహకారం అందించాలని ఆలోచన చేసి ఈరోజు ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్ట్ లో దాదాపుగా 100 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ₹10 లక్షల రూపాయల ప్రమాద బీమా చేయించి ఈరోజు బాండ్స్ ను అందించడం జరిగింది. కార్మికుల భద్రత, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, DC చైర్మన్లు పాల్గొన్నారు.



