🚪రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఘనంగా ఇంటింటి ప్రచారం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం క్లస్టర్ 3 పరిధిలో ( 53- బత్తలవళ్ళం
54-విట్టయ్య పాలెం
57- కడూరు
72-తొండంబట్టు
75-చిన్నపాoడూర్
77- చిలమత్తూరు
78- మత్తేరిమిట్ట
80-సిద్ధమాగ్రహారం
81-తొండూరు ) గ్రామంలో బుధవారం విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సత్యవేడు టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ ‘ కూరపాటి శంకర్ రెడ్డి గారు అదేశాల మేరకు , కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందించిన సంక్షేమ ప్రయోజనాలను తెలియజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వరదయ్యపాలెం మండలం – క్లస్టర్ 3 మల్లికార్జున నాయుడు పరిధిలో ఈ సందర్భంగా మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జ్లు, బూత్ ఇన్చార్జ్లు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు


