రాజన్న సిరిసిల్ల ఆగస్టు 1 ( పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ మండలం మొరాయిపల్లె గ్రామంలో అకాల వర్షాల కారణంగా మహమ్మద్ లాల్ బి ఇల్లు కూలిపోవడంతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పడంతో పాటు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితులు అదే స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


