అనపర్తి, సెప్టెంబరు 27 (పున్నమి ప్రతినిధి): అనపర్తి పట్టణంలోని కుమ్మరి వీధిలో వినాయక చవితి మహోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని శ్రీ గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



