శ్రీ కాళహస్తి, జూన్ 20, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తిలోని పవిత్ర స్వర్ణముఖి నది సంరక్షణ, పునరుజ్జీవన లక్ష్యంతో చేపట్టనున్న ‘స్వచ్ఛ స్వర్ణముఖి’ ప్రజా ఉద్యమానికి మద్దతు, మార్గదర్శకత్వం అందించాలని తేజోభారత్ సంస్థాపక అధ్యక్షురాలు, దేవస్థానం బోర్డు సభ్యురాలు కోలా విశాలి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కోరారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కోలా విశాలి మాట్లాడుతూ, శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆధ్యాత్మిక వైభవంతో పాటు ప్రపంచ ప్రఖ్యాత కలంకారీ కళ అభివృద్ధికి స్వర్ణముఖి నది కీలకంగా నిలిచిందన్నారు. చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ఈ నది ప్రస్తుతం కాలుష్యం, వ్యర్థాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నమామి గంగే’, ‘సబర్మతి రివర్‌ఫ్రంట్’ వంటి విజయవంతమైన కార్యక్రమాల స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నది పరిశుభ్రత, కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, తీర ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కల నాటకం, విద్యార్థులు, భక్తులు, స్వచ్ఛంద సేవకులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాబోయే తరాలకు స్వర్ణముఖి నదిని పరిశుభ్రంగా, పచ్చదనంతో అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఆమె, ఎమ్మెల్యే సహకారంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పర్యావరణ ఉద్యమంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీఆర్‌వో చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, బీజేపీ కోఆర్డినేటర్ కోలా ఆనంద్ కుమార్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

స్వచ్ఛ స్వర్ణముఖికి ఎమ్మెల్యే సహకారం కోరిన కోలా విశాలి