మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు
రష్యా ప్రభుత్వ నియంత్రిత ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్‌బ్యాంక్ (Sber Bank) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్ (Mr Albert Yefimov) తో రాష్ట్ర విద్య, నైపుణ్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… “రష్యన్ స్టార్టప్ ఫౌండర్లకు సుస్థిరమైన లోకలైజ్డ్ జనరేటివ్ ఏఐ ప్రోత్సాహాన్ని అందించిన తరహాలోనే భారతదేశంలో బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రిటైల్ రంగాలకు స్బేర్ బ్యాంక్ గ్లోబల్ ఎలైట్ సేవలను విస్తరించాలని, జాతీయ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) నెట్‌వర్క్ భద్రతను పటిష్టం చేస్తూ, స్బేర్‌బ్యాంక్ యొక్క అడ్వాన్స్‌డ్ వాయిస్ రికగ్నిషన్ & బయోమెట్రిక్ యాంటీ ఫ్రాడ్ నెట్‌వర్క్‌ను భారతదేశ బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల్లో ఇంటిగ్రేట్ చేసేలా సాంకేతిక సహకారం అందించాలని” లోకేష్ కోరారు.


