అరకులోయ, సెప్టెంబర్ 10: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేయాలని ఎమ్మెల్సీ డా.కుంభా రవిబాబు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధికి వైఎస్సార్, జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషిని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం గిరిజన సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మారికవలస గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. 2029లో జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. సమావేశంలో ఎంపీ గుమ్మా తనూజరాణి, జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


