శ్రీకాళహస్తి, మే 01 (పున్నమి న్యూస్): ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం నిరుపేదల జీవితాల్లో సంక్షేమ దీప్తిని నింపుతోందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు 19వ వార్డులో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ..అభివృద్ధి–సంక్షేమం తెలుగుదేశం పార్టీకి రెండు కళ్లు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ మొత్తాలను పెంచడంతో పాటు పెండింగ్ బకాయిలను కూడా చెల్లించి తన నిబద్ధతను చాటుకున్నారన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్, వికలాంగులకు రూ.6 వేల వరకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. గత పాలనలో వెనుకబడిన శ్రీకాళహస్తి పట్టణం ప్రస్తుతం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి పనులతో ముందుకు సాగుతోందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపీనాథ్, మధు, సురేష్, తులసమ్మ, అమరావతి, ద్రాక్షాయిని, చెంచయ్య, లోకేష్, కార్తీక్ తదితరులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పేదల జీవితాలలో వెలుగులు నింపే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు– టీడీపీ పట్టణ అధ్యక్షుడు