సింగరాయకొండ: శ్రీ చైతన్య నవోదయ స్కూల్లో ఆరు నెలల క్రితం ఆరో తరగతి విద్యార్థి తౌషిక్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై ఇప్పటికీ న్యాయం జరగలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.తౌషిక్ మృతికి బాధ్యులను గుర్తించి స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అతని తల్లి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు.ప్రస్తుతం ఆమె సంఘమిత్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.హాస్టల్ అనుమతులపై విచారణ జరిపి, జిల్లా విద్యాశాఖ అధికారి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

తౌషిక్ మృతి కేసులో న్యాయం కోసం తల్లి ఆత్మహత్యాయత్నం