మహాముత్తారం ఆగస్టు 31, పున్నమి ప్రతినిధి:*
జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లె పిపి గ్రామలో గ్రామ పంచాయతీ వద్ద సోమవారం పౌరహక్కుల దినోత్సవం గ్రామసభను స్థానిక గ్రామ సర్పంచ్ జంగిడి కీర్తన అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఐ , మండల నాయీబ్ తహసీల్దార్ హాజరయ్యారు .
ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకి వివరించారు. ఎవరైనా అన్యాయానికి గురైతే భయపడకుండా చట్టపరమైన సహాయం తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నాయీబ్ తహసీల్దార్ పాల్గొని గ్రామ ప్రజలయొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జీపీఒ కవిత,గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు , కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


