ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి డి. మాధవి, జిల్లా విద్యాశాఖ అడ్మినిస్ట్రేషన్ అధికారి వేణుగోపాల్ గౌడ్ లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు తీవ్ర ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అమలు చేయాలని యోచిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం వల్ల వేలాది మంది వంట కార్మికుల ఉపాధికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాఠశాల స్థాయిలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తొమ్మిది నెలల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్న అల్పాహార పథకాన్ని కూడా ప్రస్తుతం పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల ద్వారానే నిర్వహించాలని, విధివిధానాలను వెంటనే ప్రకటించాలని, గ్యాస్‌తో పాటు అవసరమైన నిత్యావసర సరుకులను ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో యూనియన్ కార్మికులు సంతోష్, విమల, రేఖ, సుజాత, దేవమ్మ, రూప, అనసూయ,సంధ్యారాణి, లావణ్యలు పాల్గొన్నారు.

సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలి – ఏఐటీయూసీ