ఎర్పేడు, మే 06 (పున్నమి న్యూస్): ఎర్పేడు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త సాలమ్మ (53) మరణం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం బండారుపల్లి గ్రామానికి చేరుకుని, సాలమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ రఘునాథరెడ్డి, హరి, సుబ్రహ్మణ్యం, కాటరెడ్డి తదితరులు పాల్గొని సాలమ్మకు అంతిమ నివాళులు అర్పించారు. గ్రామంలో చురుకైన నాయకురాలిని కోల్పోవడం పట్ల గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సీనియర్ కార్యకర్త సాలమ్మ మృతి వైఎస్సార్‌సీపీకి తీరని లోటు- డాక్టర్ సిపాయి