*సిర్పూర్ నియోజకవర్గంలో హరీష్ రావు పర్యటన.. రైతుల సమస్యలపై గళమెత్తిన మాజీ మంత్రి*
ఈరోజు సిర్పూర్ నియోజకవర్గం విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాగజ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఘన స్వాగతం పలికారు.
అనంతరం కౌటాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22A కింద నిషేధ జాబితాలో రైతుల భూములను అన్యాయంగా చేర్చడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల భూములను నిషేధ జాబితాలో చేర్చడం వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించి, రైతులకు న్యాయం చేయాలని సభాముఖంగా అధికారులను హరీష్ రావు గారు హెచ్చరించారు…
రైతుల హక్కుల కోసం.. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది.అని వారు తెలిపారు….




