శ్రీకాళహస్తి, జూన్ 08, (పున్నమి న్యూస్) : ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్, జనసేన ఉమ్మడి జిల్లా కార్యదర్శి సాయి కొట్టే మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ నూతన శాశ్వత కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా మంత్రికి సాదర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఆహ్వానంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను మంత్రి అడిగి తెలుసుకొని, సాయి కొట్టేను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంత్రికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి, దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆలయ బోర్డు మెంబర్ పగడాల మురళి మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి జనసేన కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఆహ్వానం