కలువాయి మండలం వెంకట రెడ్డి పల్లి గ్రామంలోని 533 సర్వే నెంబర్ లో ఉండే భూమి మేము కొనుగోలు చేసిన రిజిస్టర్ భూమి అని వెంకటరెడ్డి పల్లి రైతులు తెలిపారు.జిల్లా కలెక్టర్, ఆత్మకూరు ఆర్ డి ఓ లకు తప్పుడు పిర్యాదులు ఇచ్చి మమ్ములను ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. మాగ్రామం లో ఎస్ సి కాలనికి వెళ్లే దారి ప్రభుత్వం రికార్డుల ప్రకారం వేరే రొండు దార్లు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం అప్పట్లో 367 సర్వే నెంబర్ లో భూమి కోని కాలనికి దారి వసతి ఏర్పాటు చేశారని తెలియజేసారు.కానీ ఎస్ సి కాలనీ వాసులు మా పొలం లో దారి గుండా వెళ్తూ మాపై అధికారులకు పిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. వాళ్ళు వెళ్తుంటే మాకేమి అభ్యంతరం లేదని కానీ దారి మాది మాకు హక్కు ఉంది అంటే మేము ఒప్పుకోమూ అని తేల్చి చెప్పారు.మా పొలం రికార్డులు తీసుకోని జిల్లా కలెక్టర్ ను కలిసి విన్న విస్తామని బాధిత రైతులు , బాబు, కాంతయ్య పేర్కొన్నారు. వెంకటరెడ్డి పల్లి లో వాళ్ళు మీడియా తో మాట్లాడారు.
Uploaded Video:

