Wednesday, 9 September 2026
  • Home  
  • వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా లోక కళ్యాణ్ మేళా శిబిరాలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా లోక కళ్యాణ్ మేళా శిబిరాలు

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పి యం స్వానిది లబ్దిదారులకు లోక కళ్యాణ్ మేళ శిబిరాలను సెప్టెంబర్ 01 నుండి సెప్టెంబర్ 30 వ తేది వరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం ముమ్మిడివరం యూనియన్ బ్యాంకు నందు నిర్వహించారు. కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఏ.దేవకీ దేవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి పథకం ద్వారా చిరువ్యాపారులు, వీధి వ్యాపారులు ఎలాంటి గ్యారెంటీ లేకుండా సులభంగా రుణాలు పొందవచ్చు అన్నారు. క్రమం తప్పకుండా రుణాలు చెల్లించే వారికి తదుపరి విడతలలో మరింత ఎక్కువ మొత్తంలో రుణాలు అందుతాయని, అలాగే డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడం ద్వారా క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని వివరించారు. బ్యాంక్ మేనేజరు ఎన్ దీలిప్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన వీధి వ్యాపారులందరూ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. శిబిరంలో పాల్గొన్న రిసోర్స్ పర్సన్లు వ్యాపారులకు అవసరమైన పత్రాలను సేకరించి, దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడంలో సహాయపడ్డారు. ఈ మేళా ద్వారా పలువురు వీధి వ్యాపారులకు నూతన రుణాలు మంజూరు మరియు క్రెడిట్ కార్డ్స్ అప్ప్రోవల్స్, పాత రుణాల పునరుద్ధరణను కూడా చేపట్టినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెప్మా ఆర్పీలు,విధి వ్యాపారస్తులు,బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.