శ్రీకాళహస్తి, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్( : గత వైసీపీ ప్రభుత్వంలో ఆశ్రిత పక్షపాతం, రాజకీయ పైరవీల కారణంగా విద్యా సంస్థల స్థాయి దిగజారిందని, ప్రస్తుతం మెరిట్ ప్రాతిపదికన నియామకాలతో విద్యా రంగంలో మార్పులు తీసుకువస్తున్నారని టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఎం. ఉమేష్ రావు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. అయన మాట్లద్తుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రముఖ విద్యావేత్తలను వైస్ చాన్సలర్లు, డైరెక్టర్లుగా నియమిస్తూ విద్యా వ్యవస్థ గౌరవాన్ని పెంచుతున్నారని కొనియాడారు. ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. రామ్‌గోపాల్ రావు కూడా లోకేష్ నిర్ణయాలను ప్రశంసించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరుగుతున్న ఈ నియామకాలు రాష్ట్ర విద్యారంగానికి పునర్వైభవం తీసుకువస్తాయని తెదేపా నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు డాక్టర్ జి. దశరథాచారి, మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యులు ఎం. సుబ్బయ్య, బీమాల భాస్కర్, వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్, బీమాల చంద్రబాబు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

విద్యా రంగంలో సంస్కరణలు-లోకేష్ నిర్ణయాలకు టీడీపీ నేతల ప్రశంసలు