తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం గట్టుమీదపల్లి వద్ద 60 మంది వికలాంగులకు 2007లో ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేసినప్పటికీ, ఇప్పటికీ ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించలేదని ఏపీ వికలాంగులు పింఛన్ దార్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జేఎన్ ఆంధ్రయ్య ఆరోపించారు. కాలనీ అభివృద్ధి, ప్లాట్ల కేటాయింపులో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎం, కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశాలు ఉన్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. జూన్ 15లోగా ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున ప్లాట్లు అప్పగించి పీఎంఏవై పథకం కింద ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే నిరాహార దీక్షలు, న్యాయ పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.

వికలాంగులకు గూడు నీడ లేకుండా చేస్తున్న రెవెన్యూ అధికారులు: జేఎన్ ఆంధ్రయ్య